Advertisement

  • అమెరికాలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరిలో అలర్జీ లక్షణాలు...

అమెరికాలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరిలో అలర్జీ లక్షణాలు...

By: Sankar Fri, 18 Dec 2020 8:39 PM

అమెరికాలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరిలో అలర్జీ లక్షణాలు...


అమెరికాలో కోవిడ్‌–19ను నిరోధించే ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

బ్రిటన్‌లో కూడా ఫైజర్‌ వ్యాక్సిన్‌తో అలర్జీకి సంబంధించిన రెండు కేసులు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని అలాస్కాలోనూ టీకా డోసు తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనారోగ్యానికి గురి కావడంపై ఆందోళన నెలకొంది.

అమెరికాలో అలర్జీ లక్షణాలు కనిపించిన ఆరోగ్య కార్యకర్తలకు గతంలో ఎప్పుడూ అలర్జీ రాలేదు. ఫైజర్‌ టీకా డోసు తీసుకున్న వెంటనే వారిలో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ల కింద వాపు, తలనొప్పి, గొం తు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికన్లలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని భరోసా ఇచ్చింది.

Tags :
|
|

Advertisement