Advertisement

  • భూవివాదాల్లో ఏసీపీ త‌ల‌దూర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు: ఏసీబీ

భూవివాదాల్లో ఏసీపీ త‌ల‌దూర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు: ఏసీబీ

By: chandrasekar Thu, 24 Sept 2020 5:15 PM

భూవివాదాల్లో ఏసీపీ త‌ల‌దూర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు: ఏసీబీ


అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ) డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్‌తో పాటు అనంత‌పురంలో మొత్తం 25 చోట్ల‌ సోదాలు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకా బ్యాంకు లాక‌ర్లు చూడాల‌న్నారు. హైద‌రాబాద్‌లోని 3 ఇండ్లు, 5 ఇంటి స్థ‌లాల‌ను ఉన్నాయని తెలిపారు.

న‌ర‌సింహారెడ్డి బంధువులు, బినామీల ఇళ్ల‌లోనూ సోదాల‌ స‌మాచారం రావాల్సి ఉంద‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల లింకులు ఇంకా బ‌య‌టకు ‌రా‌లేదు విచారిస్తున్నామ‌ని ఏసీబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌వీందర్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వ‌ర‌కు మియాపూర్‌లో సీఐగా ప‌ని చేసిన న‌ర‌సింహారెడ్డి ప‌లు భూవివాదాల్లో త‌ల‌దూర్చి ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు నిరూపణ అయ్యింది. ఉప్ప‌ల్, మ‌ల్కాజ్‌గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ త‌ల‌దూర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Tags :

Advertisement