Advertisement

  • రేపటి నుంచే స్కూల్స్ ఓపెన్ ..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు

రేపటి నుంచే స్కూల్స్ ఓపెన్ ..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు

By: Sankar Sun, 01 Nov 2020 11:31 AM

రేపటి నుంచే స్కూల్స్ ఓపెన్ ..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు


కరోనా వైరస్‌తో మూతపడిన స్కూళ్లు.. మళ్లీ తెరిచేందుకు రంగం సిద్ధమైంది.. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచే స్కూళ్లను రీ-ఓపెన్ చేయనున్నారు.. విడతల వారీగా స్కూళ్ల రీ-ఓపెనింగ్ షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేసింది ఏపీ సర్కార్... రేపటి (నవంబర్ 2) నుంచి 9, 10 క్లాసులను మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చింది సర్కార్... ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించనున్నారు... డిసెంబర్‌ 14వ తేదీ నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు క్లాస్‌లు స్టార్ట్ కానున్నాయి.

కోవిడ్‌ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే నమోదు అవుతుండడంతో.. స్కూళ్లల్లో శానిటైజేషనుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. గంట గంటకు టాయిలెట్లను క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది... మిడ్ డే మిల్స్ కూడా పరిశుభ్రమైన వాతావరణంలో చేపట్టాలని సూచించిన సర్కార్.. స్కూళ్లల్లో శానిటైజేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించనుంది..

రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లల్లోని శానిటైజేషన్ పరిస్థితులను తెలుసుకునేలా ప్రత్యేక యాప్ కూడా రూపకల్పన చేస్తున్నారు.. ప్రతీ రోజూ స్కూళ్లల్లో కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించింది సర్కార్.

Tags :

Advertisement