Advertisement

  • కోట్లాది మంది భారతీయుల కల నెరవేరేది నేడే ..అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ కు అన్ని సిద్ధం

కోట్లాది మంది భారతీయుల కల నెరవేరేది నేడే ..అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ కు అన్ని సిద్ధం

By: Sankar Wed, 05 Aug 2020 07:40 AM

కోట్లాది మంది భారతీయుల కల నెరవేరేది నేడే ..అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ కు అన్ని సిద్ధం



యావత్ భారత జాతి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి ..ఎన్నో ఏళ్ళ పోరాటం ఫలించిన క్షణాలు మరికొద్ది సేపట్లో ఆవిష్కృతం కానున్నాయి ..భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నేడు జరగనుంది ..ఒకవైపు కరోనా వైరస్ విజృంబిస్తున్నప్పటికీ , తగు జాగ్రత్త చర్యలతో మందిరం భూమి పూజ జరగనుంది ...

భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య పట్టణం సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. బారికేడ్లు, బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలువురు స్థానికులు తమ ఇళ్లకు, దుకాణాలకు కొత్త రంగులు వేసుకున్నారు. పలు చోట్ల భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి 175 మందిని మాత్రమే ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పట్టణానికి చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి స్థానికులు, ఇతర ప్రాంతాల వారు ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలు అంతా ఇళ్లల్లోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.

ఈ రోజు అనగా ఆగష్టు 5 మధ్యాహ్నం 12:30 గంటలకు భూమిపూజ ప్రారంభం, ఇక 12:40 గంటలకు పునాది రాయి పూజ..కరోనా వైరస్ కారణంగా కేవలం 175 మందికే ఆహ్వానం ..రామ్ మందిర్ కోసం విశేషంగా పోరాడిన బీజేపీ దిగ్గజాలు ఎల్ కె అద్వానీ , మురళి మనోహర్ జోషీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు..

Tags :
|
|

Advertisement