Advertisement

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధం..

By: Sankar Tue, 03 Nov 2020 5:52 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధం..


ప్రపంచ దేశాలన్ని అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల కోసం ఆత్రతుగా ఎదురు చూస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. అయితే, ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం. కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.

మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. సుమారు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. ఇక

తాజాగా వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాల్లో బైడెన్ ఏకంగా 10(పది శాతం) పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్‌కు 52 శాతం, ట్రంప్ 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలిసింది.సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ పోల్స్‌ కూడా ట్రంప్‌తో పోలిస్తే.. బైడెన్‌ 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్‌లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది..

Tags :
|

Advertisement