Advertisement

  • జేఈఈ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం.. పాటించాల్సిన నింబంధలు ఇవే

జేఈఈ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం.. పాటించాల్సిన నింబంధలు ఇవే

By: Sankar Mon, 31 Aug 2020 7:14 PM

జేఈఈ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం.. పాటించాల్సిన నింబంధలు ఇవే


కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ ఎగ్జామ్స్ తిరిగి రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి..కరోనా కేసులు ఇంకా తగ్గకపోయినప్పటికీ పరీక్షల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపింది..అయితే దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున చాల మంది ప్రముఖులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు...అయినా కూడా రేపటి నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి..

రోజుకు రెండు సెషన్స్‌గా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌... మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది. కాగా, కరోనా నిబంధనల్లో భాగంగా... పరీక్ష సమయానికి అరగంట ముందుగానే ఎగ్జామినేషన్‌ సెంటర్ల గేట్లను మూసివేయనున్నారు. అందువల్ల విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది.

ఉదయం సెషన్‌ విద్యార్థులను ఉదయం 7 గంటల 20 నిమిషాల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8 గంటల 30 నిమిషాలకు గేట్లు మూసివేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడిచిన 14 రోజుల్లో తమకు కరోన లక్షణాలు ఉన్నాయో లేదో చెప్పాలి. అలాగే, కరోనా రోగుల్ని కలిసింది, లేనిది స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇతర నగరాలకు వెళ్లినట్టయితే... ఆ వివరాలను కూడా తమ సెల్ఫ్ డిక్లరేషన్లో వెల్లడించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో మాస్కులు అందజేస్తారు... అలాగే, శానిటైజర్లతో పాటు వాటర్ బాటిళ్లను విద్యార్థులు తమ వెంట తెచ్చుకోవచ్చు. 8 లక్షల 58 వేల మంది దరఖాస్తు చేసుకోగా, దేశ వ్యాప్తంగా 660 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో గల 76 వేల 319 మంది విద్యార్థుల కోసం 27 సెంటర్స్ ఏర్పాటయ్యాయి.

Tags :
|
|
|
|

Advertisement