Advertisement

  • రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ..అన్ని ఏర్పాట్లు పూర్తి

రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ..అన్ని ఏర్పాట్లు పూర్తి

By: Sankar Mon, 30 Nov 2020 9:36 PM

రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ..అన్ని ఏర్పాట్లు పూర్తి


మరికొద్ది గంటల్లో తెలంగాణాలో అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి..రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.

బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్‌ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పోలైన బ్యాలట్ బాక్సులను, ఇతర ఎన్నికల సామగ్రిని సీలు వేయడంతో పాటుగా స్ట్రాంగ్ రూములో భద్రపరచనున్నారు. పోలింగ్ ముగింపు సమయంలో పోలింగ్ స్టేషన్ వద్ద వరుసలో ఉన్న ఓటర్ల౦దరిని ఓటు వేయడానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతించాలి. ఇందుకోసం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ సంతకం చేసి నెంబర్ వేసిన స్లిప్ లను చివరి ఓటర్ నుండి PO ఇవ్వాలి.

Tags :
|
|

Advertisement