Advertisement

  • 74 వ ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కు సిద్దమవుతున్న ఎర్ర కోట

74 వ ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కు సిద్దమవుతున్న ఎర్ర కోట

By: Sankar Thu, 13 Aug 2020 5:11 PM

74 వ ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కు సిద్దమవుతున్న ఎర్ర కోట


మరో రెండు రోజుల్లో దేశానికి అత్యంత గొప్ప రోజు అయిన ఆగస్టు 15 రాబోతుంది ..దాదాపు రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళ కింద నలిగి , ఎందరో మహానుభావుల త్యాగాల వలన 1947 ఆగష్టు 15 న భారదేశం స్వతంత్రం సాధించుకున్నది ..దీని వెనుక ఎందరో గొప్ప గోప వారి త్యాగ ఫలం ఉంది ..వారందరిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగష్టు పదిహేనును అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము ..అయితే ఈ ఏడాది దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా వేడులకు బహిరంగంగా జరుపుకోవడం సాధ్యం కావడం లేదు..

అయితే ఎప్పటి లాగానే ఈ సారి ప్రధాన మంత్రి ఎర్ర కోట మీద జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు..ప్రధాని ఆగష్టు పదిహేను ఉదయం 7:21 కి ఎర్రకోట దగ్గరికి చేరుకుంటారు..7:30 కి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు..ఆ తర్వాత త్రివిధ దళాలు అయిన ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ , నావెల్ దళాలు నుంచి గార్డ్ అఫ్ హానర్ స్వీకరిస్తారు..కరోనా కారణంగా సోల్జర్స్ మొత్తం నాలుగు లైన్ లలో నిలబడి గార్డ్ అఫ్ హానర్ ఇస్తారు ..దీనికి మొత్తం సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ కలిసి 22 మంది పాల్గొంటారు..ఇక నేషనల్ సెల్యూట్ లో 32 మంది సోల్జర్స్ మరియు ఆఫీసర్స్ పాల్గొంటారు ..ఈ ఈవెంట్ లో 350 మంది ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొంటారు.

independence event,red fort,prime minister,narendra modi,delhi ,74 వ , ఇండిపెండెన్స్ డే , ఈవెంట్ కు , సిద్దమవుతున్న,  ఎర్ర కోట


ఇక ఎర్రకోటలో లో జరిగే ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కు రిహార్సల్స్ జరుగుతున్నాయి..అయితే గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుండటం వలన అందరు రైన్ కోట్ లో రిహార్సల్స్ చేస్తున్నారు..ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా దేశం రాజధాని లోనే గాక దేశం మొత్తం మీద ఇండిపెండెన్స్ డే వేదుల మీద ఆంక్షలు ఉన్నాయి..ఈ సారి కేవలం సోల్జర్స్ , ఆఫీసర్స్ మాత్రమే ఈ వేడుకలలో పాల్గొననున్నారు..కరోనా కారణంగా ఈ ఏడాది స్కూల్ చిల్డ్రన్ ఈ వేడుకలో పాల్గొనడం లేదు..

ఇక ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఉండటం వలన ఢిల్లీ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ..ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట దగ్గర జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కనుక ఆ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ఏ వాహనాలకు అనుమతి ఉండదు ..

Tags :

Advertisement