Advertisement

  • ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజే తెలిసింది ..విజయ్ శంకర్

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజే తెలిసింది ..విజయ్ శంకర్

By: Sankar Fri, 26 June 2020 11:52 AM

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజే తెలిసింది ..విజయ్ శంకర్



ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఉంటె హంగామా అంత ఇంతా కాదు ..రెండు దేశాల ఆటగాళ్లు మైదానంలో దిగి పోరాడుతుంటే యుద్ధంలో తలపడినట్లే ఉంటుంది ..బయట అభిమానులు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదే స్థాయిలో ఊగిపోతారు ..అందుకే క్రికెట్ చరిత్రలోనే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ఇంకా వేరే ఏ మ్యాచ్ కు ఉండదు ..గత సంవత్సరం జరిగిన ప్రపంచకప్ లో చివరి సారి ఇండియా పాకిస్తాన్ జట్లు చివరి సారిగా తలపడ్డాయి ఆ మ్యాచ్ల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ..అయితే ఆ మ్యాచ్ల్లో ఆడిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఆ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ..

పాక్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్‌మెంట్‌ నా దగ్గరకు వచ్చి రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు. సిద్ధంగా ఉండు అని చెప్పడంతో నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అదే సమయానికి అక్కడికి వచ్చిన పాక్‌ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్‌- పాక్‌కు మ్యాచ్‌ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది అని పేర్కొన్నాడు.

ఆ మ్యాచ్ లో బరిలోకి దిగిన విజయ్ శంకర్ తాను వేసిన తొలి బంతికి ఇమాముల్‌ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్‌లో సర్ఫరాజ్‌ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్‌ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Tags :
|
|
|

Advertisement