Advertisement

  • హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ లను శానిటైజేషన్ చేయిస్తున్న పోలీస్ శాఖ

హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ లను శానిటైజేషన్ చేయిస్తున్న పోలీస్ శాఖ

By: Sankar Wed, 24 June 2020 2:32 PM

హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ లను శానిటైజేషన్ చేయిస్తున్న పోలీస్ శాఖ



కరోనా మహమ్మారి తెలంగాణను ఊపేస్తోంది ..మొన్నటిదాకా ఒక మాములు స్థాయిలో ఉన్న కరోనా గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది ..రోజుకి దాదాపు వెయ్యి కేసుల వరకు వస్తున్నాయి..అయితే ఇందులో కరోనా మీద పోరాడుతున్న పోలీసులు , డాక్టర్లు , పారిశుధ్య కార్మికులు ఉండటం కూడా మరింత కలవరం రేపుతోంది ..అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్న కరోనా కేసులను నిలువరించేందుకు పోలీస్ శాఖ తగిన మార్గాలను వెతుకుతుంది ..

అందులో భాగంగానే డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్‌లను డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లు శుభ్రం చేస్తున్నాయి.రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్‌లను శుద్ధి చేయనున్నారు.

ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో పల్స్‌ ఆక్సీమిషన్స్‌ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Tags :

Advertisement