Advertisement

  • దేశవ్యాప్తంగా ఊపందుకున్న చైనా వస్తు బహిష్కరణ

దేశవ్యాప్తంగా ఊపందుకున్న చైనా వస్తు బహిష్కరణ

By: Sankar Wed, 17 June 2020 10:08 PM

దేశవ్యాప్తంగా ఊపందుకున్న చైనా వస్తు బహిష్కరణ



భారత్ - చైనా మధ్య తలెత్తిన ఘర్షణ రోజు నుంచి ‘చైనా వస్తువులను భారత్‌లో బహిష్కరించాలి’ అన్న డిమాండ్ చెలరేగింది. ఎప్పుడైతే గాల్వాన్ లోయలో భారత- సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారో ఆ డిమాండ్ దేశ వ్యాప్తంగా మళ్లీ గట్టిగా తెరపైకి వచ్చింది. ఈ ఘటనకు ప్రతిగా చైనాపై ప్రతికారం తీర్చుకోవాలని, వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెచ్చుకొని గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టి బొమ్మను, చైనా జెండాను, చైనా ఉత్పత్తును దహనం కూడా చేస్తున్నారు.

యూపీలో అయితే ఓ మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మపై గొడ్డలితో దాడిచేస్తున్న దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. ఢిల్లీలో అయితే ‘చైనాపై యుద్ధం ప్రకటించండి’ అని డిఫెన్స్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మేజర్ రంజిత్ సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ... ప్రజలందరూ చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఓ అడుగు ముందుకేసి... ‘‘దురదృష్టవశాత్తు మేము తుపాకులు మరియు బుల్లెట్లను తీసుకోలేం’’ అని ఘాటుగా మండిపడ్డారు.

ఇక వారణాసి, బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇదే డిమాండ్ ఊపందుకుంది. అక్కడ కూడా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ‘‘పాకిస్తాన్‌పై ఎలా లక్షిత దాడులు చేశారో... అలాగే చైనా మీద కూడా చేయండని మోదీని డిమాండ్ చేస్తున్నారు. చైనా జెండాను, అధ్యక్షుడి దిష్టిబొమ్మను కాల్చి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం’’ అని ఓ నిరసన కారుడు మండిపడ్డాడు.

ఇక జమ్మూలో కూడా నిరసనలు మిన్నంటాయి. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. 30 నిమిషాల పాటు రోడ్లను దిగ్బంధం చేశారు. ఇక, స్వదేశీ జాగరణ్ మంచ్ చైనా వస్తువులను బహిష్కరించాల్సిందేనని ఇప్పటికే డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.




Tags :
|

Advertisement