Advertisement

  • ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు లేఖ రాసిన అఖిల భారత వ్యాపార సమాఖ్య

ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు లేఖ రాసిన అఖిల భారత వ్యాపార సమాఖ్య

By: chandrasekar Sat, 06 June 2020 7:16 PM

ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు లేఖ రాసిన అఖిల భారత వ్యాపార సమాఖ్య


కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందా లేదా అన్నది స్పష్టం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ను అఖిల భారత వ్యాపార సమాఖ్య (సీఏఐటీ) కోరింది. ఒక వేళ నోట్ల ద్వారా కరోనా సోకే అవకాశమున్నట్లతే నివారణకు ఏం చేయాలో చెప్పాలంటూ ఓ లేఖ రాసినట్లు తెలిపింది. కరెన్సీ నోట్లపై దేశంలో జరిపిన కొన్ని అధ్యయనాల వల్ల తమకు సందేహాలు ఉన్నాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. సుమారు 96 నోట్లు, 48 నాణేలపై వైరస్‌, ఫంగస్‌, బ్యాక్టీరియా ఉన్నట్లు లక్నోలోని కింగ్‌ జార్జ్‌ వైద్య యూనివర్సిటీ 2015లో పేర్కొన్నదన్నారు.

వైద్యులు, బ్యాంకులు, మార్కెట్లు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణుల నుంచి సేకరించిన 120 కరెన్సీ నోట్లలో 86.4 శాతం రోగ కారకాలు కలిగి ఉన్నట్లు 2016లో తమిళనాడులో జరిపిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. రూ.100. రూ.50. రూ.20, రూ.10 నోట్లలో వందకు 58 శాతం కలుషితమయ్యాయని, వీటి ద్వారా రోగాలు సంక్రమించే అవకాశమున్నదని కర్ణాటకలో నిర్వహించిన ఓ అధ్యయనంలో గుర్తించారని పేర్కొన్నారు. వ్యాపారుల లావాదేవీలన్నీ ఎక్కువగా కరెన్సీ నోట్లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా సోకుతుందా, నోట్లు వైరస్‌కు వాహకాలుగా ఉంటాయా లేదా అన్న తమ సందేహాన్ని నివృత్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖను కోరినట్లు వారు వెల్లడించారు.

Tags :

Advertisement