Advertisement

  • తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా అన్ని పరీక్షలు వాయిదా

తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా అన్ని పరీక్షలు వాయిదా

By: Sankar Tue, 20 Oct 2020 5:55 PM

తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా అన్ని పరీక్షలు వాయిదా


తెలంగాణాలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి..మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలకు తెలంగాణ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు...ముఖ్యంగా హైదరాబాద్ లో వ్రాశాలు తీవ్ర నష్టాన్ని కలగజేసాయి..అన్ని కాలోలలోకి వరద నీరు వచ్చి అనేక ప్రాణ నష్టం మరియు ఆస్థి నష్టం జరిగింది..దీనితో పరాజయాలు ఎవ్వరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అని ప్రభుత్వం సూచిస్తుంది..

దీనితో పాటు తెలంగాణలో అన్ని పరీక్షలూ వాయిదా వేసింది . భారీ వర్షాల కారణంగా దసరా వరకు ఎగ్జామ్స్ అన్నింటినీ పోస్ట్‌పోన్ చేసింది. దసరా పండగ తర్వాత మళ్లీ కొత్త తేదీలు ప్రకటించనుంది. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది ఉస్మానియా యూనివర్సిటీ .

ఈ నెల 27 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ నెల 22,23 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ముందుగా భావించినప్పటికీ... తాజాగా ఆ పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేశారు.మరోవైపు పీజీ ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీకి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 23 వరకు పొడిగించింది.

Tags :
|

Advertisement