Advertisement

తెలంగాణాలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా ..

By: Sankar Tue, 30 June 2020 6:39 PM

తెలంగాణాలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా ..



కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

లాక్‌డౌన్‌ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభత్వుం కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్టయింది.

ఇంతకుముందే తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే ..అయితే తెలంగాణాలో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చుతుంది ..రోజుకి వెయ్యి వరకు కరోనా కేసులు నమోదు అయితున్నాయి ..ముఖ్యంగా హైద్రాబాద్లో ఈ తీవ్రత మరీ ఎక్కువ ఉంది ..దీనితో పరీక్షల నిర్వహణ ఇప్పుడు అసాధ్యం అని తేలడంతో వాయిదాకు మొగ్గు చూపారు..

Tags :
|
|

Advertisement