Advertisement

  • కరోనా విజేతలు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలి ..మెగాస్టార్ చిరంజీవి

కరోనా విజేతలు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలి ..మెగాస్టార్ చిరంజీవి

By: Sankar Fri, 07 Aug 2020 5:26 PM

కరోనా విజేతలు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలి ..మెగాస్టార్ చిరంజీవి



ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్మా డొనేషన్ అనేది ఒక యుద్ధమని, ప్లాస్మా చికిత్సతో రోగులు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దాతలను సత్కారించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. ప్లాస్మా దాతలకు, వారి కుటుంబసభ్యులకు సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. సైబరాబాద్ పోలీసులు స్టార్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి చిరంజీవి ఎంతో సహాయపడ్డారని చెప్పారు. కరోనా విజేతలు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. కరోనాను జయించిన 3 నెలల్లోపే ప్లాస్మాను డొనేట్ చేయాల్సి ఉంటుందని, ప్లాస్మా యోధులు.. ప్రాణ దాతలంటూ సజ్జనార్ కొనియాడారు.

కాగా తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా గత 24 గంటల్లో 2200 పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..కేవలం జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే కాకుండా ఇతర జిల్లాలో కూడా కరోనా శరవేగంగా వ్యాపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు ..కరోనా చికిత్స్థలో ప్లాస్మా థెరపీ ముఖ్య పాత్ర పోషిస్తుండటంతో ..సెలెబ్రిటీలు అనేక మంది ప్లాస్మా దానం మీద అవగాహనా కల్పిస్తున్నారు

Tags :
|
|
|
|

Advertisement