Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే .. అన్ని ఏర్పాట్లు పూర్తి

జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే .. అన్ని ఏర్పాట్లు పూర్తి

By: Sankar Thu, 03 Dec 2020 5:49 PM

జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే .. అన్ని ఏర్పాట్లు పూర్తి


జిహెచ్ఎంసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే ముగిసాయి...చెదురు మదురు సంఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్ద పెద్ద సంఘటనలు జరగలేదు...ఇక పోలింగ్ ముగిసింది తర్వాతి ఘట్టం ఓట్ల లెక్కింపు ...రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది.. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

అయితే శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ ఆంజనీ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జరగబోయే జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్లో శాంతిభద్రతల ఏర్పాటులో భాగంగా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

అందులో భాగంగానే రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను చేయడం నిషేధించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరూ ఆయుధాలను చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు.

అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయడం.. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్‌ లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించరాదు

Tags :
|

Advertisement