Advertisement

  • దురాజ్ పల్లి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ..మంత్రి జగదీశ్వర్ రెడ్డి

దురాజ్ పల్లి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ..మంత్రి జగదీశ్వర్ రెడ్డి

By: Sankar Tue, 22 Dec 2020 10:42 PM

దురాజ్ పల్లి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ..మంత్రి జగదీశ్వర్ రెడ్డి


తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు జరగనున్న జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కరోనా నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గత అనుభవనాలను, పొరపాట్లను శాఖలవారీగా సమీక్షించుకోవాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన సీసీ కెమెరాలు, సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఇమాంపేట ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ యార్డ్ ఏర్పాటు చేయాలని, గుడికి సమీపంలోని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి, విద్యుత్ నిరంతరం సరఫరా చేయాలని, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

Tags :
|

Advertisement