Advertisement

  • శ్రీశైలం పవర్ ప్లాంట్ లో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి .. సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం కెసిఆర్

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి .. సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం కెసిఆర్

By: Sankar Fri, 21 Aug 2020 5:10 PM

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి .. సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం కెసిఆర్


శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

కాగా అగ్నిప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 17 మంది విధుల్లో ఉండగా.. 8 మంది ప్రమాదం అనంతరం బయటపడగలిగారు. లోపల చిక్కుకున్న తొమ్మిది మంది కోసం సీఐఎస్‌ఎఫ్‌ రెస్క్యూ బృందం రంగంలోకి దిగినప్పటికీ ఘోరం జరిగిపోయింది. కాగా, గురువారం రాత్రి 10.35 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు.

మృతుల వివరాలు :

1. DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్

2.AE వెంకట్‌రావు, పాల్వంచ

3.AE మోహన్ కుమార్, హైదరాబాద్

4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్

5.AE సుందర్, సూర్యాపేట

6. జూనియర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ రాంబాబు, ఖమ్మం జిల్లా

7. జూనియర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ కిరణ్, పాల్వంచ

8. టెక్నీషియన్‌ మహేష్ కుమార్

9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్

Tags :
|
|
|

Advertisement