Advertisement

  • ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వల్ల అలియా భట్ షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడిందా?

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వల్ల అలియా భట్ షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడిందా?

By: chandrasekar Wed, 04 Nov 2020 12:49 PM

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వల్ల అలియా భట్ షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడిందా?


ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వల్ల అలియా భట్ షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడిందా అనే సందేహం కలుగుతుంది. టాలీవుడ్‌ టు బాలీవుడ్ ఎంతో మంది ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ’ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఒకటి. లాక్‌డౌన్ తరువాత ఇటీవల సినిమా షూటింగ్ ప్రారంభమై బిజీగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆలియా భట్ నవంబర్ 2 నుండి ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి డేట్స్ కుదుర్చుకుంది. అయితే, ఆలియా భట్ షెడ్యూల్‌ను డైరెక్టర్ రాజమౌలి డిసెంబర్‌కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఫిలింనగర్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆలియా భట్ పార్ట్ చిత్రీకరించడానికి ముందు స్వాతంత్ర యోధులు కొమురం భీమ్, అల్లూరి సీత రామరాజు కలిసి ఉన్న సన్నివేశాలను పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అవడంతో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభించేందులు వీలుగా జూనియర్ ఎన్టీఆర్ తన షూటింగ్ పార్టుని త్వరగా పూర్తి చేయమని కోరినట్టు ఇటీవల టాక్ వినిపించింది. అలాగే ఆచార్య మూవీలో రామ్ చరణ్ నటించడానికి వీలు కల్పించాల్సిందిగా చిరంజీవి కూడా రాజమౌళిని కోరినట్టు ఓ టాక్ వినిపించిన విషయం తెలిసిందే. అందుకే ముందుగా ఈ ఇద్దరి హీరోలు కలిసి ఉన్న సన్నివేశాలు చిత్రీకరిస్తే ఆ ఇద్దరికి సంబంధించిన షూటింగ్ కూడా వీలైనంత త్వరలో ముగించవచ్చని రాజమౌళి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలోనే హైదరాబాద్, గుజరాత్, పూణేలలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ కోసం ఆలియా భట్ డేట్స్ ఇచ్చింది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొననుంది. అభిమానులంతా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు.

Tags :

Advertisement