Advertisement

  • పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ట్వీట్ చేసిన అలీ ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీకే ఫాన్స్

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ట్వీట్ చేసిన అలీ ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీకే ఫాన్స్

By: Sankar Wed, 15 July 2020 2:22 PM

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ట్వీట్ చేసిన అలీ ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీకే ఫాన్స్



సినిమా ఇండస్ట్రీ లో మరియు రాజకీయాలలో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరు అన్నారు ..కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ , అలీ లను చూస్తే స్నేహం అంటే వీళ్ళు ఇద్దరే అనేలా ఉండేవారు ..పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమాలో అలీ కి పక్కాగా ఒక పాత్ర ఉండేది ..అయితే గత ఏడాది ఎలక్షన్ టైం లో అలీ పవన్ మీద విమర్శలు చేయడంతో అందరు షాక్ అయ్యారు ...దీనితో అలీ , పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది ..

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే‌ని పురస్కరించుకుని అలీ చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో 20 రోజులు ముందుగానే.. అంటే జూలై 13 నుంచి ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టేశారు ఆయన అభిమానులు..ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తున్నారు. తాజాగా కమెడియన్ అలీ.. పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ ఆయన వ్యక్తిత్వంపై పొగడ్తల జల్లు కురిపించారు.

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం.. గుణం.. వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా.. చెదరని నీ నవ్వుకి, నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు’ అంటూ దండం పెడుతున్న ఎమోజీతో పాటు లవ్ సింబర్ ఎమోజీని షేర్ చేశారు అలీ..అయితే పవన్ కళ్యాణ్‌పై అలీ చేసిన ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..నీ మిత్రద్రోహాన్ని మర్చిపోలేం.. నువ్ అన్న మాటలు మాకు ఇంకా గుర్తు ఉన్నాయి.. మీ ఇద్దరి మద్య స్నేహమే ఇలా మిమ్మల్ని ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడేలా చేసింది... అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని వదిలేసిన మీకు వ్యక్తిత్వం ఉందని నేను అనుకోవడం లేదు.. అంటూ ఫాన్స్ అలీని విమర్శిస్తున్నారు

Tags :
|
|
|

Advertisement