Advertisement

  • తెలంగాణ రాజకీయాల్లో ఆగని కరోనా కేసులు ..తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

తెలంగాణ రాజకీయాల్లో ఆగని కరోనా కేసులు ..తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

By: Sankar Sat, 04 July 2020 11:47 AM

తెలంగాణ రాజకీయాల్లో ఆగని కరోనా కేసులు ..తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా



తెలంగాణాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..ముఖ్యంగా తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. వరుస పెట్టి నాయకులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే హోంశాఖ మంత్రి‌ కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. తాజాగా మరో టీఆర్‌ఎస్‌ నాయకురాలు కరోనా బారిన పడ్డారు.

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్‌ గొంగిడి సునీత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో సునీత అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఎమ్మెల్యే సునీత ఇటీవల తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేగాక ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితం ఇంకా రావాల్సి ఉంది.

Tags :
|
|
|
|

Advertisement