Advertisement

  • అత్యధిక సంపాదన కలిగిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్

అత్యధిక సంపాదన కలిగిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్

By: chandrasekar Sat, 06 June 2020 3:16 PM

అత్యధిక సంపాదన కలిగిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్


ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా ఇతను ఈ జాబితాలో ఉండటం గమనార్హం. జూన్ 2019 నుంచి మే 2020 వరకు దాదాపు రూ. 366 కోట్ల సంపాదనతో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న టాప్ 100 సెలబ్రిటీ జాబితాలో చేరారు. ఈ లిస్టులో కాస్మెటిక్స్ రారాణి కైలీ జెన్నర్ రూ. 4443 కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలోఅక్షయ్ కుమార్ 52వ స్థానంలో నిలిచారు. గతేడాది అక్షయ్ కుమార్ 33వ స్థానంలో నిలిచారు. 2019 ఈ జాబితాలో అక్షయ్ కుమార్ 19 స్థానాలు కోల్పోయిన టాప్ 100లో నిలవడం గమనార్హం.

ఏడాదికి ఈజీగా మూడు నుంచి నాలుగు సినిమాలు చేసే అక్షయ్ కుమార్ఒక్కో సినిమాకు కనీసం రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరోవైపు లాభాల్లో వాటా అదనం. దీనితో పాటు కమర్షియల్ యాడ్స్ ‌తో ఇంకో చేత్తో ఈజీగా సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ అభివర్ణించింది. ముఖ్యంగా గతేడాది రూ. 490 కోట్ల సంపాదన ఆర్జించిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడిందని ఫోర్బ్స్ వెల్లడించింది.

akshay kumar,is the top actor,in the list,of top,100 celebrities ,అత్యధిక, సంపాదన కలిగిన, టాప్ 100 సెలబ్రిటీల, జాబితాలో, టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్


అమెజాన్ ప్రైమ్‌తో అక్షయ్ కుమార్ డిజిటల్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ ఏడాది అక్షయ్ కుమార్ టాప్‌లో నిలవడానికి కారణంగా నిలించిందని ఫోర్బ్స్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌తో ఏకంగా రూ. 75 కోట్ల వరకు డీల్ కుదరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ యేడాది అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ సినిమా కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. మరోవైపు కోవిడ్ 19 కారణంగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమా డిజిటల్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. మరోవైపు అక్షయ్ కుమార్ బెల్ బాటమ్, బచ్చన్ పాండే సినిమాలగాను ఇప్పటికే రూ. 100 కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది.

మరోవైపు పోర్బ్స్ టాప్ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీ జాబితాలో వరుసగా కైలీ జెన్నర్, కన్యే వెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్ మెస్పీ, టేలర్ పెర్రీ, నేమార్, హోవర్డ్ స్టెమ్,లెబ్రాన్ జేమ్స్, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు. ఇక అక్షయ్ కుమార్.. కోవిడ్ -19 సహాయక చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు, ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్, ముంబాయి పోలీసులకు రూ. 5 కోట్ల వరకు మొత్తంగా రూ. 30 కోట్ల వరకు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే కదా.

Tags :
|

Advertisement