Advertisement

  • 'ఫౌజీ' గేమ్ ను PUBG కి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు తెలిపిన అక్షయ్ కుమార్

'ఫౌజీ' గేమ్ ను PUBG కి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు తెలిపిన అక్షయ్ కుమార్

By: chandrasekar Sat, 05 Sept 2020 09:39 AM

'ఫౌజీ' గేమ్ ను PUBG కి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు తెలిపిన అక్షయ్ కుమార్


చైనా తో నెలకొన్న గొడవలు కారణంగా ఆ దేశానికీ సంబంధించిన 118 యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో 'ఫౌజీ' గేమ్ ను PUBG కి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. దేశంలో పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి 'ఫౌజీ' (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌-గార్డ్స్‌) అని పేరుపెట్టారు. ఇది PUBG ఆడవాళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు.

'ఫౌజీ' గేమ్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్‌ భారత్‌' ఉద్యమంలో భాగంగా 'ఫౌజీ'‌ను తీసుకొస్తున్నాం. కేవలం వినోదమే కాదు. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం. ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం 'భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌'కు అందజేయనున్నామని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ గేమ్​ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించింది. ఇది భారత్ కు సంబంధించిన గేమ్ కావడంతో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ గేమ్ కు అక్షయ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఫౌజ్ అంటే హిందీలో సైన్యం అని అర్థం. అంటే భారత సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడే దృశ్యాలను గేమ్‌లో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టే అక్షయ్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఉన్న జవాన్ల భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. ఇటీవల చైనాకు చెందిన పబ్​జీ సహా 118 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో పబ్​జీ ప్లేయర్లు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో అక్షయ్‌ 'ఫౌజీ' పేరుతో కొత్త గేమ్‌ను ముందుకు తెచ్చాడు. అక్షయ్‌ పోస్టు చేసిన వెంటనే పలువురు సంతోషం వ్యక్తంచేశారు. గేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారింది.

Tags :

Advertisement