Advertisement

  • అక్ష‌య్ కుమార్ ఓ యూట్యూబ‌ర్‌కు రూ.500 కోట్లు ప‌రువున‌ష్టం క‌ట్టాల‌ని దావా

అక్ష‌య్ కుమార్ ఓ యూట్యూబ‌ర్‌కు రూ.500 కోట్లు ప‌రువున‌ష్టం క‌ట్టాల‌ని దావా

By: chandrasekar Fri, 20 Nov 2020 7:48 PM

అక్ష‌య్ కుమార్ ఓ యూట్యూబ‌ర్‌కు రూ.500 కోట్లు ప‌రువున‌ష్టం క‌ట్టాల‌ని దావా


తనపై అసత్య ఆరోపణలతో వీడియో ప్రసారం చేయడంతో అక్ష‌య్ కుమార్ ఓ యూట్యూబ‌ర్‌కు రూ.500 కోట్లు ప‌రువున‌ష్టం క‌ట్టాల‌ని దావా వేశారు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్ కుమార్ ఓ యూట్యూబ‌ర్‌కు ప‌రువున‌ష్టం దావా పంపించారు. ఎఫ్ఎఫ్ న్యూస్ అనే యూట్యూబ్ చాన‌ల్‌లో త‌న‌పై అస‌త్య వార్త‌లు ప్ర‌సారం చేసినందుకుగాను భేష‌ర‌తు క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని లేన‌ట్ల‌యితే రూ.500 కోట్లు క‌ట్టాల‌ని ప‌రువున‌ష్టం దావా పంపించారు. న‌టుడు సుశాత్‌సింగ్ రాజ్‌పుత్ హ‌త్య కేసులో ఓ యూట్యూబ‌ర్ త‌న ఎఫ్‌ఎఫ్ న్యూస్ చాన‌ల్‌లో అక్ష‌య్ కుమార్ ప్ర‌మేయం ఉంద‌ని ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశాడు.

తనకు సంబంధం లేని దీనిపై అక్ష‌య్ కుమార్ త‌న‌పై నిరాధార‌, అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని, దీనివ‌ల్ల త‌న ఇమేజ్ దెబ్బ‌తింద‌ని ప‌రువున‌ష్టం దావా పంపించారు. దీనికిగాను త‌న‌కు రూ.500 కోట్లు చెల్లించాల‌ని లేదా భేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అందులో పేర్కొన్నార‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ర‌షీద్ సిద్ధికీ వెల్ల‌డించారు. సుశాంత్ సింగ్ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రేహా చౌద‌రీ కెన‌డా పారిపోయేందుకు అక్ష‌య్ కుమార్ స‌హాయం చేశాడ‌ని ఆ వీడియోలో ప్ర‌సారం చేశార‌ని తెలిపారు.

ఈ ఆరోపణలతో బాటు అదేవిధంగా ఈ కేసు విష‌యం చ‌ర్చించేందుకు మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో ర‌హస్య స‌మావేశాలు నిర్వ‌హించార‌ని నిరాధార, అస‌త్య క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసిన‌ట్లు ఆ నోటీసులో పేర్కొన్న‌ట్లు న్యాయ‌వాది తెలిపారు. యూట్యూబ‌ర్‌పై ముంబైలోని వివిధ స్టేష‌న్ల‌లో ఇప్ప‌టికే పలు కేసులు న‌మోద‌యిన‌ట్లు చెప్పారు. దీంతో యూట్యూబ‌ర్‌పై చర్య తీసుకోనున్నారు.

Tags :

Advertisement