Advertisement

  • అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ విడుదల

అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ విడుదల

By: Sankar Mon, 19 Oct 2020 12:11 PM

అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ విడుదల

అక్కినేని ఇంట మూడో తరంలో చిన్న వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు..అందం , అభినయం ఉన్న కూడా సరైన హిట్ లేకపోవడంతో ఇంతవరకు బ్రేక్ అందుకోలేకపోయారు తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.యూత్ అంతా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అటు అఖిల్ కూడా ఈ సినిమా తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు . నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ పొందాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ''హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్ లో 50 పర్సెంట్ కెరీర్.. 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. కెరీర్ ని సూపర్ గా సెట్ చేశా.. కానీ ఈ మ్యారీడ్ లైఫ్.. అయ్యయ్యోయ్యో..'' అని అఖిల్ ప్రీ టీజర్ లో చెప్పాడు. ఇక టీజర్ ను అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల కు విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు.

Tags :

Advertisement