Advertisement

  • ధోని గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆకాష్ చోప్రా ..

ధోని గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆకాష్ చోప్రా ..

By: Sankar Wed, 08 July 2020 07:31 AM

ధోని గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆకాష్ చోప్రా ..



టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు సందర్భంగా అతడితో అనుబంధం ఉన్న అనేక మంది మాజీ ఆటగాళ్లు , ప్రస్తుత ఆటగాళ్లు ఆ అనుభవనాలను పంచుకున్నారు ..అయితే ధోని సీనియర్ క్రికెట్ లోకి రావడానికి ముందు ఇండియా ఏ తరుపున బరిలో దిగాడు ..అయితే ఆ జట్టులో ప్రస్తుత ప్రముఖ కామెంటేటర్ , అప్పటి టెస్ట్ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఒకరు ..దీనితో ధోనితో తనకు ఉన్న అనుభవాలను చోప్రా పంచుకున్నాడు ..

2004లో భారత-ఎ జట్టు జింబాబ్వే, కెన్యాలలో పర్యటించింది. అప్పుడు యువ ధోనీ.. ఆకాశ్ రూమ్మేట్. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను చోప్రా గుర్తు చేసుకుంటూ.. ‘‘ఇది 2004లో జరిగింది. భారత-ఎ జట్టు జింబాబ్వే, కెన్యాలలో పర్యటించింది. నేను టెస్టు ఓపెనర్. నా జూనియర్ ధోనీ నా రూమ్మేట్. రూముకొచ్చాక ‘ఏం తింటావ్’ అని ధోనీని అడిగాను. దానికి ధోనీ.. నేనేం ఆర్డర్ చేస్తే అదే తింటానన్నాడు. ఆ తర్వాత నువ్వెప్పుడు నిద్రపోతావని అడిగితే.. ‘నువ్వెప్పుడు లైటు ఆపితే అప్పడే’ అని బదులిచ్చాడు.

నిజం చెప్పాలంటే ధోనీ నుంచి నేను ఆ సమాధానం ఊహించలేదు. నా ఆర్డర్ నేను చేసుకుంటాను.. నేను తర్వాత పడుకుంటాను వంటి సమాధానం వస్తుందని అనుకున్నా. ధోనీ గొప్పతనం అదే. సాధారణ జీవితం, గొప్ప ఆలోచనలు’’ అని చోప్రా పేర్కొన్నాడు. ‘‘ఆ తర్వాత ఒకసారి ఆ పొడవైన జుట్టు ను కట్ చేసుకోమని చెప్పాను. నువ్వంత జుట్టుతో ఉంటే నిన్న సీరియస్ ఆటగాడిగా ప్రజలు పరిగణించరని, కాబట్టి జుట్టు కట్ చేసుకోవాలని ప్రేమగా చెప్పాను. దానికి ధోనీ ఏం చెప్పాడో తెలుసా?.. ‘నేను నా జుత్తును కట్ చేసుకోను. బహుశా జనాలు కూడా నన్ను చూసి ఇలా జుత్తు పెంచుకుంటారేమో’’ అని చెప్పాడని చోప్రా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ధోనీ చెప్పినట్టే జరిగింది. పొడవాటి జుట్టుతో ఫేమస్ అయిన ధోనీని అభిమానులు అనుకరించారు.పొడవాటి జుట్టు అప్పట్లో ఫ్యాషన్ అయిపోయింది.


Tags :
|
|

Advertisement