Advertisement

  • గంగూలీ కెప్టెన్సీ పరిస్థితులు వేరు , ధోని ఉన్నపుడు వేరు ..ఆకాష్ చోప్రా

గంగూలీ కెప్టెన్సీ పరిస్థితులు వేరు , ధోని ఉన్నపుడు వేరు ..ఆకాష్ చోప్రా

By: Sankar Sun, 19 July 2020 9:11 PM

గంగూలీ కెప్టెన్సీ పరిస్థితులు వేరు , ధోని ఉన్నపుడు వేరు ..ఆకాష్ చోప్రా



టీం ఇండియా కు కెప్టెన్లు గా చేసిన వాళ్లలో ధోని , గంగూలీ ముందు వరుసలో ఉంటారు ..అయితే ఈ ఇద్దరు కెప్టెన్లలో ఎవరు గొప్ప అంటే చెప్పడం మాత్రం చాల కష్టం ..అయితే తన హయాంలో గంగూలీ మ్యాచ్ విన్నర్లను తయారు చేశాడని, కానీ ధోనీ అలాంటి పనేమీ చేయలేదని గంభీర్ విమర్శించాడు..

టీమిండియా మాజీ సారధులు గంగూలీ, ధోనీలను పోలుస్తూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు.గంగూలీ సారధ్య బాధ్యతలు స్వీకరించినప్పుడు పరిస్థితులు, ధోనీ ఆ పని చేసినప్పుడు పరిస్థితులు వేరని చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దాదా(గంగూలీ) సారధ్య బాధ్యతలు తీసుకున్నాడు. ధోనీ సమస్య వేరు. లెజెండరీ ఆటగాళ్లున్న జట్టును ముందుకెలా తీసుకెళ్లాలి? అనేది ధోనీ ఎదుర్కొన్న ఛాలెంజ్’ అని చోప్రా పేర్కొన్నాడు.

కాగా ధోని కెప్టెన్సీ లో టీమిండియా ప్రపంచ కప్పులు , ఛాంపియన్ ట్రోఫీ , ఆస్ట్రేలియా లో సీబీ సిరీస్ లాంటి గొప్ప గొప్ప టోర్నీ లను గెలుచుకుంది ..మరోవైపు గంగూలీ టీం ఇండియాకు విదేశాలలో గెలవడం నేర్పించాడు ...అప్పటిలో అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు గంగూలీ సారధ్యంలోని టీమిండియా మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది ..గంగూలీ సారధ్యంలో టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ వరకు చేరుకుంది ..ఇంగ్లాండ్ లో నత్వేస్ట్ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ గెలుచుకుంది ..

Tags :
|

Advertisement