Advertisement

  • ధోని తొలుత డీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు ..కానీ ఇప్పుడు ధోనిని మించిన వాళ్ళు లేరు ..ఆకాష్ చోప్రా

ధోని తొలుత డీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు ..కానీ ఇప్పుడు ధోనిని మించిన వాళ్ళు లేరు ..ఆకాష్ చోప్రా

By: Sankar Wed, 01 July 2020 5:29 PM

ధోని తొలుత  డీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు ..కానీ ఇప్పుడు ధోనిని మించిన వాళ్ళు లేరు ..ఆకాష్ చోప్రా



క్రికెట్ లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ..అయితే ఇటీవల కాలంలో క్రికెట్లో వచ్చిన సంచలనం అంటే డీఆర్‌ఎస్‌ ..డీఆర్‌ఎస్‌ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం ..అయితే అంపైర్లు సరిగా నిర్ణయం తీసుకోలేదు అనిపించినా సమయంలో మైదానంలో ఉండే ఆటగాళ్లు డీఆర్‌ఎస్‌ కోరే అవకాశం ఉంటుంది ..అప్పుడు థర్డ్ అంపైర్ దానిని రివ్యూ చేసి సరైన ఫలితాన్ని ఇస్తాడు ..అయితే డీఆర్‌ఎస్‌ వచ్చిన కొత్తలో ఇండియా దానిని సరిగా ఉపయోగించుకోలేకపోవడంతో ధోని డీఆర్‌ఎస్‌ మీద తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడు ..అయితే తర్వాతి కాలంలో డీఆర్‌ఎస్‌ లను ఉపయోగించడంలో ధోనిని మించిన ఆటగాడు ప్రపంచములోనే ఎవరు లేరు అనేంతలా అందులో నిష్ణాతుడు అయ్యాడు ..

అయితే ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఆరంభంలో డీఆర్‌ఎస్‌ వాడేందుకు భారత్ ఇష్టపడలేదు. డీఆర్‌ఎస్‌ పై అప్పటి కెప్టెన్‌ ధోనీకి నమ్మకం ఉండకపోవడమే దీనికి కారణమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. ‘కుంబ్లే కెప్టెన్సీలో భారత్‌ అందరికన్నా ముందే 2008లో శ్రీలంకపై డీఆర్‌ఎ్‌సను ఉపయోగించింది. కానీ ఆ మ్యాచ్‌లో సరైన నిర్ణయాలు రాలేదు. అది కొత్త పద్దతి కాబట్టి ఎలా వినియోగించుకోవాలో మనకు అర్థం కాలేదు. అందుకే భారత్‌ ఇష్టపడలేదు.

అదీ కాకుండా డీఆర్‌ఎస్‌ అంటే ధోనీకి పెద్దగా ఇష్టం లేదు. అతడు కెప్టెన్‌ అయ్యాక టీమిండియా ఈ పద్దతికి దూరంగానే ఉంది. అయితే కెప్టెన్‌ కోహ్లీ డీఆర్‌ఎస్‌ కు అభిమాని కావడంతో ప్రస్తుతం భారత మ్యాచ్‌ల్లోనూ ఈ పద్దతి కనిపిస్తోంది. కానీ ధోనీకి డీఆర్‌ఎస్‌ పై ఎంత వ్యతిరేకత ఉన్నా అతడు వికెట్ల వెనకాల నుంచి సిగ్నల్‌ ఇచ్చాడంటే అది కచ్చితంగా అవుట్‌ అయినట్టే. అందుకే దీన్ని ధోనీ రివ్యూ సిస్టమ్‌ అని కూడా అభిమానులు పిలుచుకుంటారు’ అని చోప్రా తెలిపాడు

Tags :
|
|
|

Advertisement