Advertisement

  • జడేజానే టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ..ఆకాష్ చోప్రా

జడేజానే టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ..ఆకాష్ చోప్రా

By: Sankar Mon, 13 July 2020 10:33 AM

జడేజానే టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ..ఆకాష్ చోప్రా



ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా ... ,మెరుపు వేగంతో మైదానంలో కదులుతూ , ఎక్కడినుంచైనా డైరెక్ట్ వికెట్లను త్రో వేయడంలో జడేజాను మించిన వాళ్ళు లేరు ..అందుకే ఎందరో మాజీ ఆటగాళ్లు జడేజానే టీంఇండియాలో అత్యుత్తమ ఫీల్డర్ అని కితాబిచ్చారు ..తాజాగా టీమిండిన మాజీ ఓపెనర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా తన అల్ టైం టీమిండియా బెస్ట్ ఫీల్డర్ల జాబితాలో జడేజాకు తొలిస్థానం కట్టబెట్టాడు ..

మైదానంలోని ఏ ప్రదేశం నుంచైనా బంతిని వికెట్లపైకి విసరగల సామర్థ్యం రవీంద్ర జడేజాకి ఉందని చెప్పుకొచ్చిన ఆకాశ్ చోప్రా.. అందుకే అతనికి అగ్రస్థానాన్ని కట్టబెట్టినట్లు వెల్లడించాడు. ఇక సురేశ్ రైనా స్లిప్‌లో మెరుగైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందగా.. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ పాయింట్‌ రీజిన్‌లో తిరుగులేని ఫీల్డర్లుగా అప్పట్లో ప్రశంసలు అందుకున్నారు. ఐదో స్థానంలో కపిల్‌దేవ్‌ ఎంపికకి 1983 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తీరే కారణమని చెప్పుకొచ్చిన ఆకాశ్ చోప్రా.. విరాట్ కోహ్లీ ఇప్పుడిప్పుడే ఫీల్డింగ్‌లో ఎదుగుతున్నందున అతడ్ని ఆరోస్థానానికి పరిమితం చేసినట్లు వివరించాడు.

ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ఆరుగురు ఇండియా బెస్ట్ ఫీల్డర్లు: 1. రవీంద్ర జడేజా, 2. సురేశ్ రైనా, 3. మహ్మద్ కైఫ్, 4. యువరాజ్ సింగ్, 5. కపిల్‌‌దేవ్ 6. విరాట్ కోహ్లీ

Tags :
|
|
|
|
|
|

Advertisement