Advertisement

  • అశ్విన్ వెర్సస్ లయన్ ...ఆకాష్ చోప్రా ఓటు ఎవరికీ ..?

అశ్విన్ వెర్సస్ లయన్ ...ఆకాష్ చోప్రా ఓటు ఎవరికీ ..?

By: Sankar Sun, 28 June 2020 9:09 PM

అశ్విన్ వెర్సస్ లయన్ ...ఆకాష్ చోప్రా ఓటు ఎవరికీ ..?



ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లు ఇద్దరు నాథన్ లయన్ , రవిచంద్రన్ అశ్విన్ ..ఇద్దరు తమ జట్లలో కీలక ఆటగాళ్లు ..అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టమే ..అయితే అశ్విన్ కంటే లయన్ అత్యుత్తమ స్పిన్నర్ అంటున్నాడు మాజీ ఇండియన్ ఆటగాడు ఆకాష్ చోప్రా ..

ప్రస్తుత క్రికెట్‌లో అశ్విన్‌, లయన్‌లు ఇద్దరు గొప్ప స్పిన్నర్లు. సులువుగా వికెట్లు పడగొట్టగలరు. అయితే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాలంటే మాత్రం నేను లయన్‌ వైపే మొగ్గుచూపుతాను. ఎందుకుంటే అతడి బౌలింగ్‌ యాక్షన్‌ నాకు బాగా నచ్చుతుంది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించకున్నా బౌన్స్‌ రాబట్టి వికెట్లను పడగొడతాడు. బంతిపై అతడికి మంచి నియంత్రణ ఉంటుంది. ఎక్కడ, ఎలా బౌలింగ్‌ చేయాలో బాగా తెలుసు.

ఉపఖండపు పిచ్‌లపై ముఖ్యంగా భారత్‌ మైదానాలలో లయన్‌తో పోలిస్తే వికెట్ల వేటలో అశ్విన్‌ చాలా ముందుంటాడు. అయితే ఉపఖండపు పిచ్‌లపై లయన్‌ రాణిస్తూనే ఆసీస్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా మైదానాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. అందుకే ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో లయన్‌ ది బెస్ట్‌ అని చెబుతున్నాను’ అంటూ చోప్రా పేర్కొన్నాడు. ఇక అశ్విన్‌ 71 టెస్టుల్లో 365 వికెట్లు పడగొట్టగా.. లయన్‌ 96 టెస్టు మ్యాచ్‌ల్లో 390 వికెట్లను చేజిక్కించుకున్నాడు.

Tags :
|
|

Advertisement