Advertisement

  • దినేష్ కార్తీక్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆకాష్ చోప్రా

దినేష్ కార్తీక్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆకాష్ చోప్రా

By: Sankar Fri, 28 Aug 2020 8:41 PM

దినేష్ కార్తీక్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆకాష్ చోప్రా


కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే మళ్లీ టీ20ల్లో టీమ్‌ ఇండియాకు ఎంపికయ్యే అవకాశముందని, అయితే అతడలా చేయగలడా అనేదే ప్రశ్నగా మిగిలిందని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రా అన్నాడు. ఇటీవల తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌చేసిన వీడియోలో ఆకాశ్‌ మాట్లాడాడు. రిషబ్ పంత్, మనీష్ పాండే తమ స్థానాలను సుస్థిరం చేసుకోనందున..

కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ను తిరిగి 5వ స్థానంలో తీసుకునే అవకాశం ఉందా? అని ఓ క్రికెట్‌ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్‌ చోప్రా స్పందిస్తూ.. ‘మీరు చెబుతున్నది సరైనదని నేను భావిస్తున్నాను. అతను ఖచ్చితంగా తిరిగి రాగలడు. కానీ అతను ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించాలి.. కాని అతడు అలా చేయగలడా’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరపున మిడిలార్డర్‌లో కాకుండా బ్యాటింగ్‌లో కొంత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అతను బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకోవాలి. తద్వారా ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌గా ఉన్నా కదా అని 5వ స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆలోచనను మానుకోవాలి. కార్తిక్‌ కీపర్‌గా కూడా రాణిస్తున్నాడు. కానీ ఇప్పటికే టీమిండియాలో కేఎల్‌ రాహుల్, రిషబ్‌ పంత్‌ ఉన్నారు. కాబట్టి ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తే కార్తిక్‌ టీ20 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.’ అని చోప్రా అన్నాడు.

Tags :
|

Advertisement