Advertisement

  • బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి ...ఆ యువ ఆటగాడికి సలహా ఇచ్చిన ఆకాష్ చోప్రా

బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి ...ఆ యువ ఆటగాడికి సలహా ఇచ్చిన ఆకాష్ చోప్రా

By: Sankar Tue, 08 Dec 2020 12:25 PM

బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి ...ఆ యువ ఆటగాడికి సలహా ఇచ్చిన ఆకాష్ చోప్రా


గత ఏడాది క్రితం టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు అంటే అందరి కళ్ళు పంత్ పైనే ఉన్నాయి ..అయితే ఏడాది తిరిగేలోగా టీంఇండియాలో చోటు కోల్పోయే పరిస్థితికి వచ్చాడు ఈ యువ వికెట్ కీపర్..పంత్‌ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని తెలిపాడు మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా..

ఆసీస్‌ టూర్‌కు పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నా రాహుల్‌ ఫామ్‌ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్‌ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్‌ టెస్టులు ఆడడం కష్టమే. ఆసీస్‌- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఇండియా- ఏ తరపున పంత్‌ స్థానంలో సాహాకు స్థానం లభించిదంటేనే విషయం అర్ధమయి ఉండాలి. రానున్న రోజుల్లో పంత్‌ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు.

ఇప్పటికైనా బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి. ఆటలో తను చేసిన తప్పిదాలే.. ఇప్పుడు పంత్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. స్వయంగా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడు. మళ్లీ తుది జట్టులోకి రావాలంటే కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉంది.. లేదంటే అతని కెరీర్‌ ముగిసినట్లే 'అని వెల్లడించాడు

Tags :

Advertisement