Advertisement

  • రెండేళ్లలో పంత్ పరిస్థితి అంతా మారిపోయింది ...ఆకాష్ చోప్రా

రెండేళ్లలో పంత్ పరిస్థితి అంతా మారిపోయింది ...ఆకాష్ చోప్రా

By: Sankar Tue, 22 Dec 2020 3:49 PM

రెండేళ్లలో పంత్ పరిస్థితి అంతా మారిపోయింది ...ఆకాష్ చోప్రా


ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత టీంఇండియాలో ప్రక్షాళన మొదలయింది...తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్లో అత్యంత దారుణ ప్రదర్శన చేయడంతో టీమిండియా మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి...దీనితో ఘోరంగా విఫలమైన షా స్థానంలో గిల్ , స్వదేశానికి వచ్చిన కోహ్లీ స్థానంలో రాహుల్ , గాయపడ్డ షమీ స్థానంలో సిరాజ్ లేదా నవదీప్ ఎంపిక అవ్వడం ఖాయంగా ఉంది.

తొలి టెస్టులో అటు కీపర్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన వృద్ధిమాన్‌ సాహాకు మరో స్థానం ఇస్తారా లేక రిషబ్‌ పంత్‌కు చోటు ఇస్తారా అన్నది వేచి చూడాలి. అయితే వీరిద్దరిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

వృద్ధిమాన్ సా‌హా విషయంలో మాత్రం జట్టు మేనేజ్‌మెంట్‌ రెండో ఆప్షన్‌పై ఇంకా ఆలోచించా​ల్సి ఉంది. ఎందుకంటే పంత్‌ అనుకున్నంత ఫామ్‌లో లేడు.. ప్రస్తుత వాతావరణంలో పంత్‌పై అనుకూలత లేదు. వాస్తవానికి గత ఆసీస్‌ పర్యటనలో ‌పంత్‌ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత పంత్‌ కీపింగ్‌ సరిగా చేయడని.. సాహా బ్యాటింగ్‌ చేయలేడనే వాతావరణంలోకి మారిపోయింది. తొలి టెస్టులో సాహా కీపర్‌గానూ.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం లేదంటూ' ముగించాడు

Tags :

Advertisement