Advertisement

  • సచిన్ కొడుకా ..గవాస్కర్ కొడుకా కాదు ..టాలెంట్ ఉంటేనే జట్టులో చోటు ..ఆకాష్ చోప్రా

సచిన్ కొడుకా ..గవాస్కర్ కొడుకా కాదు ..టాలెంట్ ఉంటేనే జట్టులో చోటు ..ఆకాష్ చోప్రా

By: Sankar Sun, 28 June 2020 08:55 AM

సచిన్ కొడుకా ..గవాస్కర్ కొడుకా కాదు ..టాలెంట్ ఉంటేనే జట్టులో చోటు ..ఆకాష్ చోప్రా



నేపోటిసం ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చుసిన ఇదే మాట వినిపిస్తుంది ..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణంతో అందరూ ఒక్కసరిగా షాక్కు గురి అయ్యారు ..నేపోటిసం కారణంగానే ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ హఠాత్తుగా మరణించాడని చాల మంది వ్యాఖ్యానిస్తున్నారు ..అయితే ఇప్పుడు ఈ బంధుప్రీతి మీద క్రికెట్లో కూడా చర్చ మొదలైంది ..

ముఖ్యంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ను టార్గెట్‌ చేస్తూ భారత క్రికెట్‌లో నెపోటిజం ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ కుమారుడనే ఒకే ఒక కారణంతో అతడిని ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూనే ప్రతిభ ఉన్నా జట్టులోకి తీసుకోని పలువురు ఆటగాళ్ల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు.

అయితే ఈ విషయం మీద ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ..సునీల్‌ గావస్కర్‌ తనయుడు రోహన్‌ గావస్కర్‌ కూడా బెంగాల్‌ రంజీ టీంలో మెరుగైన ప్రదర్శన చేశాడు కాబట్టే భారత జట్టులోకి వచ్చాడు. గావస్కర్‌ ఇంటి పేరు ఉన్నప్పటికీ రోహన్‌కు ముంబై రంజీ టీంలో చోటు దక్కని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌లు ఆడి విజయాలను అందించినప్పటికీ తన కొడుకుకు కనీసం ముంబై టీంలో అవకాశం సునీల్‌ గావస్కర్‌ అవకాశం ఇప్పించలేదు. ఎందుకుంటే ప్రతిభ ఉంటే అవకాశం వస్తుంది. బంధుప్రీతితో కాదు’ అంటూ అకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

Tags :
|
|

Advertisement