Advertisement

  • ఎక్కడైనా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది ..అజిత్ దోవల్

ఎక్కడైనా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది ..అజిత్ దోవల్

By: Sankar Mon, 26 Oct 2020 2:40 PM

ఎక్కడైనా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది ..అజిత్ దోవల్


వాస్తవాధీన రేఖ వద్ద మంకుపట్టు వీడని చైనాకు భారత్ గట్టి హెచ్చరిక పంపించింది. అవసరమైతే శత్రువు నట్టింట్లోకి వెళ్ళి పోరాడతామని హెచ్చరించింది. భారత దేశం తన సొంత గడ్డపై మాత్రమే కాకుండా, తన భద్రతకు ముప్పు ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తుందని తెలిపింది.

మే నెల నుంచి తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనాకు ఇది స్పష్టమైన హెచ్చరిక.జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హృషీకేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దేశం ఎవరిపైనా ముందుగా దాడి చేయకపోయినప్పటికీ, భద్రతా ముప్పును మొగ్గలోనే తుంచడానికి ముందుగానే చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది నూతన వ్యూహాత్మక ఆలోచన అని తెలిపారు.

‘‘మీకు కావలసిన చోట మాత్రమే మేం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ముప్పు ప్రారంభమైన గడ్డపైనే భారత్ యుద్ధం చేయగలదు’’ అని దోవల్ చెప్పారు. ‘‘నవ భారతం’’ సిద్ధాంతాన్ని ఈ విధగా వివరించారు. స్వప్రయోజనాల కోం మనం ఎన్నడూ దాడులు చేయలేదు. మనం కచ్చితంగా పోరాడతాం, మన గడ్డపైనా, విదేశీ గడ్డపైనా కూడా. అయితే మన స్వప్రయోజనాల కోసం కాదు. పరమార్థతత్త్వం కోసం పోరాడతాం’’ అని చెప్పారు. భారత దేశం నాగరిక దేశమని, ఇది ఏదో ఒక మతం, భాష లేదా వర్గంపై ఆధారపడినది కాదని చెప్పారు. సంస్కృతి ఈ దేశానికి పునాది అని వివరించారు.



Tags :
|

Advertisement