Advertisement

  • ధోని , కోహ్లీ కెప్టెన్సీ లో అదే ప్రధాన తేడా ..అజిత్ అగార్కర్

ధోని , కోహ్లీ కెప్టెన్సీ లో అదే ప్రధాన తేడా ..అజిత్ అగార్కర్

By: Sankar Tue, 25 Aug 2020 9:25 PM

ధోని , కోహ్లీ కెప్టెన్సీ లో అదే ప్రధాన తేడా ..అజిత్ అగార్కర్


మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎవరో ఒకరు ధోని గురించి మాట్లాడుతూనే ఉన్నారు..తాజాగా టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ధోని , కోహ్లీ మధ్య కెప్టెన్సీ లో తేడాలను వివరించాడు..

ధోనీ, కోహ్లీ కెప్టెన్సీ మధ్య తేడా గురించి స్టార్‌ స్పోర్ట్స్ షోలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ‘‘ధోనీ అతిగా స్పిన్నర్లపై ఆధారపడితే.. విరాట్ కోహ్లీ మాత్రం ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా రాణించడానికి ఇది కూడా ఒక కారణం. ఇక టీమ్‌ని నడిపించడంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయాలు సాధిస్తున్నాడు. కెప్టెన్‌ తన టీమ్‌లోని ఆటగాళ్లపై నమ్మకం ఉంచినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి’’ అని అగార్కర్ వెల్లడించాడు.

ఇక 1998లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ అగార్కర్.. 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లాడి.. 2007లో అంతర్జాతీయ క్రికెట‌్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన అజిత్ అగార్కర్.. వన్డేల్లో మాత్రం 5.07 సగటుతో 288 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ 42 మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 29 వికెట్లతో నిరాశపరిచాడు.

Tags :
|
|

Advertisement