Advertisement

  • వన్డేల్లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికయినా నేను సిద్ధం ..అజింక్య రహానే

వన్డేల్లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికయినా నేను సిద్ధం ..అజింక్య రహానే

By: Sankar Sun, 12 July 2020 07:06 AM

వన్డేల్లో ఏ స్థానంలో బ్యాటింగ్  చేయడానికయినా నేను సిద్ధం ..అజింక్య రహానే



టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే వన్ డే జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు ..టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్ గా ఉన్న రహానే , వన్ డే , టి ట్వంటీ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు ..నమ్మదగిన ఆటగాడు అయినప్పటికీ ..యువ ఆటగాళ్ల జోరులో కొంచెం వెనకబడ్డాడు ..అయితే తిరిగి లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో చోటు దక్కించుకుంట అన్న ఆశాభావం వ్యక్తం చేసాడు ..

భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్తతో ఈఎస్‌పీఎన్ ఛాట్ షోలో అజింక్య రహానె మాట్లాడుతూ ‘‘వన్డే జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను రెడీ. ఓపెనర్‌గా ఆడమన్నా లేదా నెం.4లో బ్యాటింగ్ చేయమన్నా నాకు ఓకే. ప్రస్తుతం వన్డేల్లో రీఎంట్రీ నా టార్గెట్. ఒకవేళ అవకాశం దొరికితే మూడు ఫార్మాట్లలోనూ ఆడటానికి నేను మానసికంగా సిద్ధమయ్యా. వన్డేల్లో ఓపెనర్‌గా ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. అలానే నెం.4లో కూడా’’ అని వెల్లడించాడు.

భారత జట్టులోకి 2011లో ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానె ఇప్పటి వరకూ 65 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 42.89 సగటుతో 4,203 పరుగులు చేసిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో.. అతనిపై వేటు వేసిన భారత సెలక్టర్లు.. గత ఏడాది నుంచి నెం.4లో శ్రేయాస్ అయ్యర్‌ని ఆడిస్తున్నారు. రహానె ఆఖరిగా 2018, ఫిబ్రవరిలో వన్డే మ్యాచ్ ఆడాడు.

Tags :
|
|
|

Advertisement