Advertisement

  • రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది; అజేయ కల్లం

రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది; అజేయ కల్లం

By: chandrasekar Thu, 03 Sept 2020 5:08 PM

రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది; అజేయ కల్లం


ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మాట్లాడుతూ రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుందని అన్నారు. రైతులకు అందించబోయే స్మార్ట్ మీటర్లను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ అనేది యధావిధిగా అమలు అవుతుందని సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలో రైతులకు అందచేస్తున్న తొలి సీఎం జగనే అని అజేయ కల్లం తెలిపారు. ఇప్పుడు మీటర్లు పెట్టి భవిష్యత్తులో ఏదో చేస్తామనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్ల పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తే అది బయటపడుతోందని అజేయ కల్లం వెల్లడించారు. రైతు ఖాతాల నుంచి ఆటో డెబిట్ పద్దతిన డిస్కంలకు చెల్లింపులు జరుగుతాయని అన్నారు.

రైతులు ఎక్కడా రూపాయి కట్టాల్సిన పనిలేదని తెలియ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించే రాష్ట్రాలు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం చట్టం చేయబోతోందని అజేయ‌ కల్లం పేర్కొన్నారు. కేంద్రం డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్టును రాష్ట్రాలకు అందజేసిందని ఇందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజెసారు. తండ్రి చేపట్టిన సంస్కరణలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం వదిలేసిన విద్యుత్ బకాయిల్లో రూ. 14,023 కోట్లు చెల్లించామని అన్నారు. ఏపీలో 12శాతం అదనపు విద్యుత్‌ ఉత్పత్తి ఉందని ఆయన వెల్లడించారు.

Tags :

Advertisement