Advertisement

అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు కరోనాతో మృతి

By: chandrasekar Wed, 07 Oct 2020 4:16 PM

అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు కరోనాతో మృతి


దేశంలో కరోనావైరస్ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులు యిలా అందరి ప్రాణాలను తీస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ సోదరుడు కరోనా బారిన పడి కన్నుమూశారు. అజయ్ దేవగన్ క‌జిన్ బ్ర‌ద‌ర్ అనిల్ దేవ‌గ‌న్ (51) కరోనాతో మంగళవారం మరణించారు. ఈ విష‌యాన్ని అజ‌య్ దేవ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. స్వ‌ల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అనిల్ దేవగన్ చ‌నిపోతాడని ఊహించ‌లేద‌ని అజ‌య్ దేవగన్ అన్నారు. తాను, తన కుటుంబం, చిత్ర నిర్మాణ సంస్థ ఏడీఎఫ్ఎఫ్ అనిల్‌ను చాలా మిస్స‌వుతున్నట్లు తెలిపారు. అనిల్ దేవ‌గ‌న్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌నను, తన కుటుంబాన్ని తీవ్రంగా క‌లచివేసింద‌ని ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తూ అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు.

అనిల్ దేవ‌గ‌న్ 2000లో తీసిన రాజు చాచా సినిమా ఆయ‌నకు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ఆయ‌న 2005లో బ్లాక్‌మెయిల్‌, 2008లో హాల్ ఎ దిల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క నిర్మాత‌గా చేశారు. దీంతోపాటు అజయ్ దేవ్‌గన్, సోనాక్షి సిన్హా నటించిన సన్ ఆఫ్ సర్దార్ (2012) సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా కారణంగా మృతి చెందిన అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్‌కు పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. అనిల్ దేవగన్ మరణం పట్ట అభిషేక్ బచ్చన్, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా సంతాపం తెలిపారు.

Tags :
|
|

Advertisement