Advertisement

  • గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ...సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వ్యాఖ్యలు

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ...సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వ్యాఖ్యలు

By: Sankar Tue, 21 July 2020 1:23 PM

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ...సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వ్యాఖ్యలు



కరోనా కేవలం మనిషిని మనిషి తాకడం ద్వారా లేదా , అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు , లేదా దగ్గినప్పుడు ఆ తుంపరలు అవతల వ్యక్తుల మీద పడటం ద్వారా వస్తుందని అని తెలుసు ..అయితే ఇటీవల కాలంలో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై భారత్‌లోని అత్యున్నత ఆర్ అండ్ డీ సంస్థ సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే కీలక వివరాలను వెల్లడించారు..

బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా.. ఆఫీసుల్లాంటి అన్ని మూసి ఉండే ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లొద్దని.. పని ప్రదేశాల్లాంటి చోట గాలి వెలుతురు సరిపడా వచ్చేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

కరోనా కట్టడి కోసం మాస్కులు ధరించడమే చక్కటి వ్యూహమని సీఎస్ఐఆర్ చీఫ్ తెలిపారు. కరోనా సోకిన వారు దగ్గినా లేదా తుమ్మినా పెద్ద తుంపర్లు ఉపరితలం మీద పడతాయి. కానీ చిన్న తుంపర్లు మాత్రం ఎక్కువ సేపు గాల్లోనే ఉండిపోతాయి. కాబట్టి వీటి వల్ల గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది’’ అని సీఎస్ఐఆర్ చీఫ్ తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement