Advertisement

  • ఉద్యోగులకు మరొక అవకాశం యిచ్చిన ఎయిర్ ఇండియా ...

ఉద్యోగులకు మరొక అవకాశం యిచ్చిన ఎయిర్ ఇండియా ...

By: chandrasekar Tue, 13 Oct 2020 2:57 PM

ఉద్యోగులకు మరొక అవకాశం యిచ్చిన ఎయిర్ ఇండియా ...


ఎయిరిండియా పర్మినెంట్ ఉద్యోగులు వేతనంలేని సెలవును ఉపయోగించుకోవడం లేదంటే వారంలో మూడు రోజుల పాటు మాత్రమే పనిచేసి అరవైశాతం వేతనం తీసుకొనే పథకాల్లో ఏదొక దానిని ఎంపిక చేసుకోవడానికి తాజాగా గతంలో ఇచ్చిన గడువును పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు ఈ పథకాల్లో ఒకదానిని ఉద్యోగులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎల్ డబ్ల్యూ పీ పథకాన్ని 2020 జూలై 14వ తేదీన తీసుకు వచ్చింది. దీనిని సెప్టెంబర్ 30వ తేదీకి ఈ గడువును పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ మీనాక్షి కష్యప్ ఈ మేరకు అక్టోబర్ 9వ తేదీన స్టాఫ్ నోటీస్ జారీ చేశారు. ఎయిరిడిండియాలో 13,000 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంపిక చేసారు. దీంతో వార్షిక వేతన బిల్లులో రూ.7 కోట్ల వరకు సంస్థకు కలిసి వస్తుంది. ఎయిర్ ఇండియా బోర్డు జూలై నెలలో ఉద్యోగులకు వేతనం లేని సెలవు ఆప్షన్‌కు ఆమోదం తెలిపింది. ఆరు నెలల నుంచి రెండేండ్ల వరకు కాలపరిమితికి ఉద్యోగులను సెలవులపై పంపించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిని ఐదేండ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది.

వేతనం లేని సెలవులు ఆప్షన్ ఎంచుకోకుంటే పర్మినెంట్ సిబ్బంది (పైలట్లు, క్యాబిన్ సిబ్బంది మినహా) వారానికి మూడు రోజుల పాటు 60 శాతం వేతనంతో పని చేయడం కోసం 'షార్టర్ వర్కింగ్ వీక్ స్కీం'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా విమానయాన రంగంపై భారీగా ప్రభావం పడింది. విమానాలు నెలల పాటు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. మే 25వ తేదీ నుండి భారత్‌లో విమాన కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్వస్థితిలో 45 శాతం కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి. డొమెస్టిక్ విమానాలు మే 25 నుండి 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఈ రంగంపై ప్రభావం చూపుతోంది.

Tags :

Advertisement