Advertisement

  • ఎటువంటి యుద్ధం వ‌చ్చినా విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు: ఎయిర్ చీఫ్ భ‌దౌరియా

ఎటువంటి యుద్ధం వ‌చ్చినా విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు: ఎయిర్ చీఫ్ భ‌దౌరియా

By: chandrasekar Tue, 06 Oct 2020 1:23 PM

ఎటువంటి యుద్ధం వ‌చ్చినా విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు: ఎయిర్ చీఫ్ భ‌దౌరియా


వైమానిక ద‌ళ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... యుద్ధ‌ప‌రంగా మ‌న ద‌ళాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. భ‌విష్యుత్తులో ఎటువంటి యుద్ధం వ‌చ్చినా దాంట్లో విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. పొరుగు దేశాల నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో యుద్ధ సామ‌ర్థ్యాన్ని మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉ౦‌ద‌న్నారు. మ‌న ద‌ళాలు ఉత్తమంగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అన్ని కీల‌క ప్రాంతాల్లో ద‌ళాల‌ను మోహ‌రించామ‌ని, ల‌డాఖ్ అనేది చిన్న భాగ‌మ‌న్నారు. యుద్ధ విమానాలైన రాఫేల్స్‌, చినూక్‌లు, అపాచీలను అతి త‌క్కువ స‌మ‌యంలో ఆప‌రేట్ చేశామ‌ని, ప్ర‌స్తుతం ఉన్న వైమానిక శ‌క్తికి తోడుగా మిగ్‌-29 కూడా తోడ్పాటు ఉంటుంద‌న్నారు. స‌మ‌ర సామ‌ర్ధ్యాన్ని, విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచ‌డ‌మే త‌మ
ల‌క్ష్య‌మ‌ని, ఆధునీక‌ర‌ణ‌, ఆప‌రేష‌న‌ల్ ట్రైనింగ్‌, స్వ‌దేశీ ఆయుధాల వినియోగాన్ని పెంచ‌డం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భ‌దౌరియా తెలిపారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాల‌పై న‌మ్మ‌కాన్ని పెంచుకున్నామ‌ని, రానున్న అయిదేళ్ల‌లో మ‌రో 83 ఎల్‌సీఏ మార్క్ 1 విమానాల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

స్వ‌దేశీ ఉత్ప‌త్తిలో డీఆర్‌డీవో, హెచ్ఏఎల్‌కు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హెచ్‌టీటీ40, లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో ఒప్పందం చేసుకోనున్న‌ట్లు పేర్కొన్నారు. చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో ల‌డాఖ్‌లో వైమానిక ద‌ళాల మోహ‌రింపై భదౌరియా కామెంట్ చేశారు. అన్ని ఆప‌రేష‌న్ల లొకేష‌న్ల‌లో త‌మ ద‌ళాలు ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు. ఎటువంటి విపత్తు ఎదురైనా, దాన్ని ఎదుర్కొనేందుకు బ‌ల‌మైన‌, స్థిర‌మైన రీతిలో ద‌ళాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. చైనా స‌రిహ‌ద్దుల్లో మ‌న పొజిష‌న్ మెరుగ్గా ఉంద‌ని, సంక్లిష్ట ప‌రిస్థితి ఎదురైతే.. చైనాకు గ‌ట్టి జ‌వాబు ఇవ్వ‌గ‌ల‌మ‌ని ఆయ‌న తెలిపారు. స‌రిహ‌ద్దు ద‌ళాల్లో చైనా క‌న్నా మెరుగైన రీతిలో బ‌ల‌గాల‌ను మోహ‌రించిన‌ట్లు తెలిపారు. అయితే రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ఆధారంగా భ‌విష్య‌త్తు ప‌రిస్థితి ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని భ‌దౌరియా చెప్పారు. అయితే స‌రైన రీతిలో ఆ చ‌ర్చ‌లు సాగాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags :
|

Advertisement