Advertisement

  • ఎయిమ్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్... సుశాంత్ మరణం ఆత్మహత్యే త‌ప్ప హత్య కాదు

ఎయిమ్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్... సుశాంత్ మరణం ఆత్మహత్యే త‌ప్ప హత్య కాదు

By: chandrasekar Mon, 05 Oct 2020 11:53 AM

ఎయిమ్స్  ఫోరెన్సిక్ రిపోర్ట్... సుశాంత్ మరణం ఆత్మహత్యే  త‌ప్ప హత్య కాదు


జూన్ 14న బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయ‌న మృతిపై అనేక అనుమానాలు వ్య‌క్తం కాగా, సీబీఐ ద‌ర్యాప్తు చేప‌డుతుంది. అయితే రీసెంట్‌గా సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించి అది ఆత్మహత్యే త‌ప్ప హత్య కాద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం 45 రోజుల పాటు అనేక కోణాల‌లో ఇన్వెస్టిగేట్ చేసి ఇది హ‌త్య కాదు అనే విష‌యాన్ని తెలిపారు. అంతేకాదు ముంబై కూపర్ ఆసుపత్రి నివేదికతో తాము ఏకిభ‌విస్తున్న‌ట్టు పేర్కొన్నారు. సుశాంత్‌ని ఎవ‌రైన‌ చంపిన‌ట్టు ఆధారాలు ల‌భ్య‌మైతే ఐపీసీ లోని 302 సెక్షన్ ను కొత్తగా చేర్చి సీబీఐ దర్యాప్తు చేయ‌నుంది.

ఈ క్ర‌మంలో అంద‌రి దృష్టి సీబీఐపై ఉంది. అయితే సుశాంత్ మృతి కేసులో మొద‌టి నుండి ముంబై పోలీసుల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా ముంబై పోలీస్ క‌మీష‌నర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ ఈ కేసు గురించి ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా కొంద‌రు స్వార్ధ‌ప్ర‌యోజ‌నాల కోసం మ‌హారాష్ట్ర పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తును విమ‌ర్శించారు. ఇప్పుడు ఎయిమ్స్ ఫ‌లితాల‌తో మేమేంట‌ని నిర్ధార‌ణ అయిందని తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం సుశాంత్ కేసు డ్ర‌గ్స్ వైపు ట‌ర్న్ తీసుకోగా, అంద‌రి దృష్టి బాలీవుడ్ తార‌ల‌పై పడింది.

Tags :
|
|

Advertisement