Advertisement

  • సుశాంత్ మరణంపై సిబిఐ కి సంచలన విషయాలు చెప్పిన ఎయిమ్స్

సుశాంత్ మరణంపై సిబిఐ కి సంచలన విషయాలు చెప్పిన ఎయిమ్స్

By: Sankar Mon, 05 Oct 2020 9:40 PM

సుశాంత్ మరణంపై సిబిఐ కి సంచలన విషయాలు చెప్పిన ఎయిమ్స్


బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో...సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

అయితే ఆయన ఆత్మ హత్య చేసుకోలేదని హత్య అంటూ వాదనలు వచ్చిన తరుణంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందం ప్రకటించింది. సుశాంత్ మృతి పట్ల అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. కొంతమంది ఆయనకు విషం ఇచ్చారని ఆరోపించగా మరికొందరు గొంతు నులిమి చంపారని అన్నారు. అయితే అదంతా ఏమి లేదని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

ఈ మేరకు సీబీఐకి తమ మెడికో లీగల్ ఒపీనియన్ ని తెలియజేసింది. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. ఇది సూసైడ్ కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. దీంతో సుశాంత్ మృతిపై వచ్చిన అనేక అనుమానాలపై స్పష్టత వచ్చింది. దీంతో ఇక సీబీఐ సుశాంత్ కేసు సూసైడ్ కోణంలో దీన్ని దర్యాప్తు చేయనుంది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ఆయనను ప్రేరేపించారా అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేయనున్నారు అధికారులు.

Tags :
|
|

Advertisement