Advertisement

ఎస్పీ బాలు అందుకే మరణించారంట...!

By: Anji Sun, 27 Sept 2020 09:39 AM

ఎస్పీ బాలు అందుకే మరణించారంట...!

మెదడులో రక్తస్రావం, శ్వాసకోశ సమస్యలతోనే ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. వెంటనే గుర్తించి తీవ్ర చికిత్సలు ప్రారంభించినా ఎస్పీబీని కాపాడలేకపోయామన్నారు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్లు దీపక్‌ సుబ్రమణియన్‌, సభానాయగం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఊబకాయం తగ్గించుకునేందుకు ఏడేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయించుకోవడం మినహా ఆయనకు మధుమేహం కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆహారపు నియమాలను కూడా చక్కగా పాటించేవారని తెలిపారు. గత ఆగస్టు 3న జలుబు, జ్వరం రావడంతో తమ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నప్పుడు స్వల్పంగా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయన్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలని సూచించామని పేర్కొన్నారు.

ఆగస్టు 5న ఆస్పత్రిలో చేరారని, మూడు రోజుల వరకూ అంతా సవ్యంగా సాగిందని, ఆ తర్వాత ప్రాణవాయువు కొరత ఏర్పడటంతో 9న అత్యవసర చికిత్స విభాగానికి తరలించామని వివరించారు. 13న వెంటిలేటర్‌, మరుసటి రోజు ఎక్మో పరికరం అమర్చినట్లు తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన వైద్య నిపుణుల సలహాలతో చికిత్స చేశామన్నారు.

5దీంతో ఆయన స్పృహలోకి వచ్చి అందరినీ గుర్తించగలిగారని, సెప్టెంబరు 5న వివాహవార్షికోత్సవం కూడా జరుపుకున్నారని పేర్కొన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకుని కోలుకుంటూ వచ్చారని, గత గురువారం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి ఆందోళనకరంగా మారిందన్నారు.

4శరీరమంతా వైరస్‌ వ్యాప్తించి అవయవాలు దెబ్బతిన్నాయని, వెంటనే సీటీస్కాన్‌ తీసి పరీక్షించినప్పుడు మెదడులో రక్తస్రావం గుర్తించామన్నారు. అదే సమయంలో శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఫలితం లేకపోయిందని వైద్యులు పేర్కొన్నారు.

Tags :

Advertisement