Advertisement

  • తిరిగి క్రికెట్ కు రంగం సిద్ధం ..నేటి నుంచే ఇంగ్లాండ్- విండీస్ తొలి టెస్ట్

తిరిగి క్రికెట్ కు రంగం సిద్ధం ..నేటి నుంచే ఇంగ్లాండ్- విండీస్ తొలి టెస్ట్

By: Sankar Wed, 08 July 2020 05:55 AM

తిరిగి క్రికెట్ కు రంగం సిద్ధం ..నేటి  నుంచే ఇంగ్లాండ్- విండీస్ తొలి టెస్ట్



కరోనా మహమ్మరి కారణంగా క్రికెట్ చరిత్రలోనే చాలా కాలం తర్వాత ఇన్ని రోజులు విరామం వచ్చింది ..అయితే క్రికెట్ అంటే పడి చచ్చే దేశాలలో ఒకటి అయినా ఇంగ్లాండ్ ఎక్కువ కాలం క్రికెట్ ఆడకుండా ఉండలేకపోయింది ..కరోనా తో సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తుంటే ఇంగ్లాండ్ జట్టు మాత్రం క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధం అయింది ..టెస్ట్ క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే ఇంగ్లండ్లో ఫాన్స్ లేకుండా ఖాళి స్టేడియం లో మ్యాచ్ నిర్వహించడం బహుశా ఇదే తొలి సారి కావొచ్చు ..వెస్ట్ ఇండీస్ ను టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఒప్పించిన ఇంగ్లాండ్ జట్టు నేటి నుంచి సౌతాంప్టన్‌ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది ..కరోనా వైరస్‌ విజృంభణకు ముందు మార్చి 13న సిడ్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది.

ఇంగ్లండ్‌ జట్టు జనవరిలో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–1తో గెలుచుకుంది. ఇందులో ఆడిన వారిపైనే నమ్మకముంచిన బోర్డు 13 మందితో జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ టెస్టుకు దూరం కాగా... తొలిసారి బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రూట్‌ స్థానంలో రోరీ బర్న్స్‌ తుది జట్టులోకి రావడం మినహా మరో మార్పునకు అవకాశం లేదు. అయితే బర్న్స్‌ ఓపెనర్‌గా ఆడితే క్రాలీ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్‌లో ఓలీ పాప్, జోస్‌ బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. స్టోక్స్, స్యామ్‌ కరన్‌వంటి ఆల్‌రౌండర్లతో జట్టు బలం మరింత పెరిగింది. అత్యంత అనుభవజ్ఞులైన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. మూడో పేసర్‌గా జోఫ్రా ఆర్చర్‌కే ఎక్కువ అవకాశం ఉన్నా... వుడ్‌ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మొత్తంగా స్వదేశంలో ఇంగ్లండ్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

వెస్టిండీస్‌ తమ చివరి టెస్టు మ్యాచ్‌ను గత ఏడాది డిసెంబరులో అఫ్గానిస్తాన్‌తో ఆడింది. అయితే భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ పిచ్‌లు పూర్తిగా భిన్నం కాబట్టి ఇప్పటి తుది జట్టులో మార్పులు తప్పకపోవచ్చు. ఓపెనర్లుగా క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ జోడీకి మంచి రికార్డే ఉంది. ఆ తర్వాత షై హోప్, బ్రూక్స్‌ జట్టు బ్యాటింగ్‌ భారాన్ని మోస్తారు. అఫ్గాన్‌ జట్టుపై సెంచరీతో బ్రూక్స్‌ తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. దూకుడుగా ఆడే హెట్‌మైర్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనుండటంతో విండీస్‌ బ్యాటింగ్‌ కొంత బలహీనపడింది. అతని స్థానంలో బ్లాక్‌వుడ్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. అలా అయితే ముగ్గురు రెగ్యులర్‌ పేసర్లకు చోటు కల్పించడం కష్టం. ఆల్‌రౌండర్లు హోల్డర్, ఛేజ్‌ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. ఆఫ్‌స్పిన్నర్‌గా కార్న్‌వాల్‌కు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు విండీస్‌ ఎంత వరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం.

అయితే కరోనా మహమ్మారి దెబ్బకు క్రికెట్ ఎప్పుడెప్పుడు జరుగుతా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ సిరీస్ జరగాలి అని చూస్తున్నారు ..బయో సెక్యూర్ వాతావరణంలో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ విజయవంతంగా ముగిస్తే మిగతా జట్లకు కూడా క్రికెట్ టోర్నీల నిర్వహణ మీద నమ్మకం వస్తుంది ..



Tags :

Advertisement