Advertisement

  • తన పెళ్లి విషయంపై స్పందించిన అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్

తన పెళ్లి విషయంపై స్పందించిన అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్

By: chandrasekar Mon, 13 July 2020 5:15 PM

తన పెళ్లి విషయంపై స్పందించిన అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్


లాక్‌డౌన్ సమయాన్ని తమ వ్యక్తిగత జీవితానికి సెలబ్రిటీలు బాగా వినియోగించుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు నిశ్చితార్థం, పెళ్లి అంటూ లాక్‌డౌన్ టైమ్‌ను ఇట్టే గడిపేస్తున్నారు. క్రికెటర్లు తమ కుటుంబంతో చాన్నాళ్ల తర్వాత అధిక సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో యువ సంచలనం అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ తన పెళ్లి విషయంపై స్పందించాడు. తాను పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పి క్రికెట్ అభిమానులకు పెద్ద షాకిచ్చాడు.

అఫ్గానిస్థాన్ జట్టు తరఫున ప్రపంచ కప్ నెగ్గిన తర్వాతే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు యువ సంచలనం రషీద్ ఖాన్ చెబుతున్నారు. పెళ్లి కోసం పెద్ద కోరిక బయటపెట్టి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు.

ఆజాదీ రేడియోతో ఇంటర్వ్యూలో భాగంగా 21 ఏళ్ల అఫ్గానిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. అఫ్గానిస్థాన్ ఓ వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే తన నిశ్చితార్థం, వివాహం జరుగుతాయని పెద్ద కోరికనే బయటపెట్టాడు. టీ20లలో ఐసీసీ నెంబర్ వన్ బౌలర్‌గా రషీద్ ఖాన్ (749 పాయింట్లు) కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ అఫ్గాన్ తరఫున 7 టెస్టులు, 67 వన్డేలు, 48 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపుతిప్పాడు.

Tags :

Advertisement