Advertisement

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ ఓపెనర్ సీరియస్

By: chandrasekar Mon, 05 Oct 2020 3:28 PM

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ ఓపెనర్ సీరియస్


ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ ఓపెనర్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా వుంది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ నజీబుల్లా తరకై (29) చావుబతుకుల్లో ఉన్నాడు. తూర్పు నంగర్హార్‌లో ఓ గ్రోసరీ మార్కెట్ నుంచి వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నజీబుల్లాను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న నజీబుల్లా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక సీఈవో నజీమ్ జార్ అబ్దుల్ రహీంజాయ్ మాట్లాడుతూ నజీబుల్లా ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ తరపున 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నజీబుల్లా 12 టీ20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. టీ20లలో అర్ధ సెంచరీ సహా 258 పరుగులు చేశాడు. అలాగే, 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2030 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 17 లిస్ట్ ఎ మ్యాచుల్లో 553 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Tags :
|

Advertisement