Advertisement

  • మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా౦: ఆదిమూలపు సురేష్

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా౦: ఆదిమూలపు సురేష్

By: chandrasekar Wed, 09 Sept 2020 1:12 PM

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా౦: ఆదిమూలపు సురేష్


ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. ఓ వైపు అమరావతి రైతులు ఇంకా దీక్షల్లోనే ఉండగా మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మీడియాకెక్కి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ... సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పారని తాము ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమేనని మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకాలకు పేరు మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ గతంలో ఇచ్చిన మెనుకు ఇప్పటి మెనుకు తేడా గమనించాలని ఆయన చెప్పారు. రైతులకు ఎప్పుడు కరెంట్ ఉచితంగా ఇవ్వకూడదని చంద్రబాబు వాదించారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని కొడాలి నాని ఆ ప్రకటనలో చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అన్నట్టు తెలిపారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదని ఉన్నవారు కూడా జారిపోతున్నారని కొడాలి నాని అన్నారు. లోకేశ్‌ను ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్లా కాదని ఆరోపించారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ రూ. 30 వేల కోట్లతో తెస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అంటే కోర్టుకు వెళ్లి స్టే తేవడం విడ్డూరమని కొడాలి నాని ఆ ప్రకటనలో తెలియజేసారు. అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని కొడాలి నాని ప్రకటన చేసిన అనంతరం మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Advertisement