Advertisement

  • అతడి వైఫల్యమే టీమిండియా ఓటమికి దారితీసింది ..ఆడమ్ గిల్‌క్రిస్ట్‌

అతడి వైఫల్యమే టీమిండియా ఓటమికి దారితీసింది ..ఆడమ్ గిల్‌క్రిస్ట్‌

By: Sankar Mon, 21 Dec 2020 4:49 PM

అతడి వైఫల్యమే టీమిండియా ఓటమికి దారితీసింది ..ఆడమ్ గిల్‌క్రిస్ట్‌


ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే..రెండో రోజు వరకు టీమిండియానే ఫేవరేట్ గా ఉన్నప్పటికీ, మూడో రోజు కేవలం గంట వ్యవధిలోనే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది...టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే ఆల్ అవుట్ అయి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది..ఇక ఈ ఓటమిపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్ స్పందించాడు..

తొలి టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. టీమిండియా గతంలో ఇక్కడ పర్యటించిన జట్టులో పృథ్వీషా ఒక సభ్యుడు. పృథ్వీ షాకు ఆస్ట్రేలియాలోని పరిస్థితులు తెలియంది కాదు. పృథ్వీ షాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని షా నిలబెట్టలేదు. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌ విమర్శలకు దారితీస్తోంది. బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో షా విఫలం అయ్యాడు.

ఓపెనర్‌గా షా తొందరగా విఫలం కావడమే టీమిండియా కొంపముంచింది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు తెలిసినా షాట్ల ఎంపిక సరిగా లేదు. అతనొక టాలెంటెడ్‌ యువ క్రికెటర్‌. కానీ తొలి టెస్టులో అతని ఆట సెలక్టర్లను డైలమాలో పడేసింది. బాక్సింగ్‌ డే టెస్టుకు షాను పక్కకు పెట్టి శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించాలి’ అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు...

Tags :
|
|

Advertisement